
(pvginox. com )
తిరుపతిని మెడికల్ హబ్ గా తీర్చిదిడాలి..
పల్మనాలజీ సెంటర్ అవసరం..
సీఎం చంద్రబాబు ద్రుష్టికి తీసుకెళ్దాం..
ఏపీ హ్యాండీ క్రాఫ్ట్స్ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్
తిరుపతిని మెడికల్ హబ్ గా తీర్చి దిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇందుకు తిరుపతి లో అన్ని అవకాశాలు ఉన్నాయని ఏపీ హ్యాండీక్యాప్డ్ చైర్మన్ డా పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. శనివారం అప్సెకామ్ పల్మనాలాజి కాన్ఫరెన్స్ తిరుపతి లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డా హరిప్రసాద్ మాట్లాడుతూ తిరుపతిలో డా ప్రేమానంద్, డా సుబ్బారావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరగడం గర్వకారణం అన్నారు. తిరుపతి లో స్విమ్స్, బర్డ్స్, టాటా క్యాన్సర్, అరవింద్ కంటి ఆసుపత్రి, ప్రభుత్వ పరంగా పీడియాట్రిక్, కార్డియాలజీ, లాంటి హాస్పిటల్స్ ఉన్నాయని, ఇదే కోవలో మెడికల్, సర్జికల్ కలిసి ఉండేవిధంగా పల్మనాలాజి సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ డా.సిపాయ్ సుబ్రహ్మణ్యం, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డా శ్రీహరి రావు, భారత దేశంలోనే పేరెన్నిక గన్న పర్మనాలోజిస్ట్ డా. ప్రేమానంద్, కోవిద్ సమయంలో ఎంతోమంది ప్రాణాలు కాపాడి ప్రభుత్వం చే అవార్డు తీసుకున్న డా సుబ్బారావు లు ఏంతో మన తిరుపతి కి గర్వ కారణమన్నారు..
