Uncategorized

జర్నలిస్టులందరికీ ఇళ్ళస్థలాలు…

Spread the love

జర్నలిస్టులందరికీ త్వరలోనే ఇళ్ల స్థలాలు కేటాయిస్త

కూటమి ప్రభుత్వంతోనే అన్ని వర్గాలకు మేలు

పరవాడ న్యూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా వార్షికోత్స వేడుకలు

ముఖ్య అతిథిగా హాజరైన పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల

(పరవాడ.. సెప్టెంబర్ 9, pvginox.com )

కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకి సమన్యాయంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు అన్నారు.. మంగళవారం పరవాడ మరిడిమాంబ కళ్యాణ మండపంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ అనుబంధ సంస్థ పరవాడ న్యూ ప్రెస్ క్లబ్ ఆరో వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులు అందరికీ త్వరలోనే ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. అలాగే జర్నలిస్టు హెల్త్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా పాలసీలు అమలు చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. గతంలో కూడా తాను పెందుర్తి., సబ్బవరం ఎలమంచిలి తదితర ప్రాంతాల్లో జర్నలిస్టులకు తన పరిధిలో ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగిందన్నారు. ఇప్పుడు కూడా పరవాడలో జర్నలిస్టులకు వీలైనంత త్వరగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తానని అలాగే ప్రెస్ క్లబ్ కి అవసరమైన స్థలాన్ని కూడా కేటాయించేందుకు కృషి చేస్తానని చెప్పారు..వృత్తిపరంగా జర్నలిస్టులు వార్తలు రాసేటప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని, తప్పు చేస్తే వాటిని సరిదిద్దుకొనడానికి అవకాశం ఉంటుందన్నారు. గౌరవ అతిథిగా హాజరైన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ నిరంతరం కృషి చేస్తుందన్నారు.. ఇళ్ల స్థలాలతో పాటు వివిధ ప్రభుత్వ పథకాలను కూడా జర్నలిస్టులకు అందించేందుకు తాము శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ మాట్లాడుతూ వీలైనంత త్వరలో జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. అందుకు ఎమ్మెల్యే పంచకర్ల సానుకూలంగా స్పందించారు. తన పరిధి మేరకు జర్నలిస్టులకు సాయం అందిస్తానని చెప్పారు. వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉపకార వేతనాలు. నిరుపేదలకు దుప్పట్లు ఎమ్మెల్యే ఇతర అతిథులు చేతుల మీదుగా పంపిణీ చేశారు. విశాఖ జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసరావు . రాష్ట్ర ఉపాధ్యక్షులు బి..ఈశ్వరరావు..అనకాపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి.వెంకటేష్ ఖాదర్.. పరవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కృష్ణ ..కార్యదర్శి నాయుడు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఈ వార్షికోత్సవ వేడుకల్లో
ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మి శ్రీనివాస్, జడ్పిటిసి పిఎస్ రాజు, మండల జనసేన పార్టీ ఇన్చార్జి పంచకర్ల ప్రసాదు, మాజీ జడ్పీటీసీ పైల జగన్నాథరావు, మాజీ ఎంపీపీ మాసవరపు అప్పల నాయుడు, అనకాపల్లి మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు కన్నూరి వెంకటరమణ,మాజీ ఎంపీపీ మాదంశెట్టి నీల బాబు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు బొద్దపు శ్రీనివాస్ కాసులు, మండల టిడిపి అధ్యక్షులు వియ్యపు చిన్న, ఎమ్మార్వో నాగరాజు, ఎంపీడీవో రమేష్ నాయుడు, పరవాడ సర్పంచ్ సిరపురపు అప్పలనాయుడు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు, ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుగిడి రామ గోవిందరావు, రావాడ సర్పంచ్ మోటూరు సన్యాసినాయుడు, పరవాడ న్యూ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శిలు లాలం కృష్ణారావు, పైల సన్యాసినాయుడు, గౌరవ అధ్యక్షులు పరవాడ జగదీశ్వరరావు, పైల ప్రసాదు, కసిరెడ్డి రాజు, పైల అక్కునాయుడు, బండారు శరన్ కుమార్, ద్వారపూడి శ్రీనివాసు,చుక్క రవికుమార్ తదితరులు పాల్గొన్నారు
అలాగే వివిధ మండలాలకు చెందిన తెలుగుదేశం జనసేన వైసిపి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *