
ప్రతిష్టాత్మకంగా సభ్యత్వ పత్రాల పంపిణీ
- జిల్లా లో జనసేన పార్టీకి తిరుగులేదు
- పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్
– జనసేన పార్టీ సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్
జనసేన పార్టీ సభ్యత్వ నమోదు పొందిన నాయకులు కార్యకర్తలకు పత్రాలను జనసేన పార్టీ సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ అందజేశారు. బుధవారం స్థానిక జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జనసేన పార్టీ సభ్యత నమోదు రికార్డు స్థాయిలో జరిగిందని పేర్కొన్నారు. టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సారథ్యంలో నమోదు కార్యక్రమం జరిగిందన్నారు. ఆయన సారధ్యంలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించామన్నారు. పార్టీలో చేరి సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుందని తెలిపారు.ఇలాంటి సౌలభ్యం ఏ పార్టీ కల్పించలేదు అని స్పష్టం చేశారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోనే రాష్ట్ర అభివృద్ధి ఇది సాధ్యం అన్నారు. కార్యకర్తలకు అన్ని విధాల అండగా ఉండే నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పారు.
-భవిష్యత్తు జనసేన పార్టీ దే నని వ్యాఖ్యానించారు. అందుకే పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారు. సభ్యత్వ నమోదు నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో క్షేత్రస్థాయిలో జరిగింది అన్నారు. ముఖ్యంగా మహిళలు ఉత్సాహం చూపడం అభినందనీయమన్నారు.జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణం చేయాలని యువత ముందుకు ముందుకొస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.ఇది శుభ పరిణామం అన్నారు. ప్రతి కార్యకర్తకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్, ఆఫీస్ ఇంచార్జి జమీర్,పావుజెన్నీ చంద్రశేఖర్, మార్కెట్ సురేష్, వై రవికుమార్, కృష్ణా రెడ్డి, సుధామాధవ్, లాయర్ శ్రీరామ్, వర్షాచలం రాజేష్, దాసరి పోలయ్య, పి శ్రీకాంత్,పెయ్యల పవన్, తాల్లూరి వెంకట్, చంటి, మహేష్, దినేష్,భరత్, శాంతికల, కృష్ణవేణి, ప్రసన్న, జనసేన నాయకులు వీర మహిళలు పాల్గన్నారు.
